పంతులుగారి మహిమా...? పవన్ కళ్యాణ్ జనసేనకు ఒక్కసారి డిమాండ్ పెరిగిపోయిందేంటి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయిందా... అంటే అవునని అంటున్నారు. చేనేత కార్మికులు చేపట్టిన సత్యాగ్రహానికి పవన్ కళ్యాణ్ మొన్నీమధ్య గుంటూరుకు వచ్చి వారికి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అక్కడ పవన్ కళ్యా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయిందా... అంటే అవునని అంటున్నారు. చేనేత కార్మికులు చేపట్టిన సత్యాగ్రహానికి పవన్ కళ్యాణ్ మొన్నీమధ్య గుంటూరుకు వచ్చి వారికి సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అక్కడ పవన్ కళ్యాణ్ ను దీవిస్తూ ఓ అర్చకుడు పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికెత్తేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పడీపడీ నవ్వారు.
ఆ సీన్ కట్ చేస్తే తాజాగా నాగబాబు తమ్ముడు పార్టీలోకి ఆహ్వానిస్తే జనసేనలో పనిచేస్తానని స్వయంగా ప్రకటించారు. ఇక బండ్ల గణేష్ అయితే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తిరుగులేని పార్టీగా ఆవిర్భవిస్తుందని తెలిపారు. ఇంకా గుత్తా జ్వాల కూడా తను పవన్ పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా వున్నట్లు ప్రకటించి, పవన్ పార్టీకి వున్న డిమాండ్ ఏమిటో తెలియజెప్పింది.
ఇకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని 2014లో ప్రారంభించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకూ పార్టీకి బలమైన పునాదులు పడలేదు. ఏదో ఒన్ మ్యాన్ షోలా నడిపిస్తున్నారు. మరి ఇలాంటి పార్టీ వచ్చే 2019 ఎన్నికల్లో అధికార పీఠాన్ని ఎలా అధిష్టిస్తుందో వెయిట్ అండ్ సీ.