శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (21:00 IST)

సీలింగ్‌కి వేలాడుతూ కనిపించిన భర్త... అర్థగంటలో ఆర్ఐ భార్య సూసైడ్

కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భర్త తీసుకున్న నిర్ణయాన్ని తట్టుకోలేని భార్య కూడా అదే తరహా నిర్ణయం తీసుకుంది. ఫలితంగా వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాదకర సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిద్దలూరు తహసీల్దారు కార్యాలయంలో రెవెన్యూ ఇనస్పెక్టర్‌గా సుశీల అనే మహిళ పని చేస్తోంది. ఈమెకు గుండా నారాయణ రెడ్డి (34) అనే వ్యక్తితో ఆరేళ్ళ క్రితం వివాహమైంది. ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. 
 
అయితే, సోమవారం ఉదయం భర్త నారాయణ రెడ్డితో భార్య సుశీల గొడవపడి ఆఫీసుకు వెళ్లిపోయింది. మధ్యాహ్న భోజన విరామంలో భర్తను చూసేందుకు ఇంటికి వచ్చింది. కానీ, అప్పటికే ఆయన విషాదకరమైన నిర్ణయం తీసుకున్నాడు. 
 
సుశీల ఇంటికి వచ్చేసరికి భర్త సీలింగుకి వేలాడుతూ కనిపించాడు. ఆపై స్థానికుల సాయంతో భర్త మృతదేహాన్ని తీసుకుని స్వగ్రామానికి ఆటోలో ఆమె బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రాచర్ల వద్ద ఆటోను ఆపించి, నారాయణరెడ్డి మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసును రిజిస్టర్ చేసి, దర్యాఫ్తు ప్రారంభించారు. 
 
ఆ తర్వాత భర్త చనిపోయిన అర్థ గంటలోనే సుశీల కూడా ఆత్మహత్యకుఈ నేపథ్యంలో సుశీల కూడా ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. దీంతో వారిఇద్దరు పిల్లలు ఇపుడు అనాథలయ్యారు.