బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 2 సెప్టెంబరు 2017 (14:56 IST)

శ్రీవారి దర్శనభాగ్యం నా అదృష్టం... దేశానికి ఆంధ్రులే తలమానికం... రాష్ట్రపతి(వీడియో)

భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకుని ప్రార్థనలు చేశారు. వేంకటేశ్వరుడి దర్శన భాగ్యం తనకు కలిగిన అదృష్టమని అన్నారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ... దేశానికి ఆంధ్రులు తలమానికంగా నిలిచారని కొనియాడారు. శుక్రవారం స్థానిక ఎస్వ

భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకుని ప్రార్థనలు చేశారు. వేంకటేశ్వరుడి దర్శన భాగ్యం తనకు కలిగిన అదృష్టమని అన్నారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ... దేశానికి ఆంధ్రులు తలమానికంగా నిలిచారని కొనియాడారు. శుక్రవారం స్థానిక ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో రాష్ట్రపతికి పౌర సన్మానం ఘనంగా జరిగింది. 
 
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... ప్రతి భారతీయుడు ఆంధ్రప్రదేశ్ లోని నాయకులు సాధించిన విజయాలు, వారి చరిత్రను చూసి గర్వించాలన్నారు. శాతవాహనుల కాలం నుంచి టంగుటూరి ప్రకాశం పంతుల వంటి ప్రజానాయకులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నామన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, దివంగత ప్రధాని పీవీ నరసింహరావు ఆణిముత్యాలను అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే అన్నారు. ఈ ప్రాంతం నుంచే సర్వేపల్లి రాధాకృష్ణన్, వివి. గిరి, నీలం సంజీవ రెడ్డి వంటి దూరదృష్టిగల నాయకులు వచ్చారన్నారు. ఇటీవల తనకు అమూల్యమైన సహచరునిగా ఎం. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా ఉండటం వారు ఈ రాష్ట్రంలోని వారే కావడం చాలా సంతోషదాయకం అన్నారు. 
 
రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా జమ్ము-కాశ్మీరులోని సైనికుల వద్దకు వెళ్లడం జరిగిందన్నారు. ఆ తర్వాత తన రెండవ పర్యటన అత్యంత శక్తివంతమైన ఆంధ్రప్రదేశ్ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని సన్నిధికి రావడం ఆయన దర్శన భాగ్యాన్ని పొందడం తన అదృష్టమన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో అనేక రంగాల్లో వేగంగా ఏపీ అభివృద్ధి చెందుతోందన్నారు.