ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (09:07 IST)

అందమైన యువతుల శరీరాలతో అక్రమ సంపాదన...

అందమైన యువతుల శరీరాలతో కొందరు అక్రమ సంపాదనకు శ్రీకారం చుట్టారు. అంటే... అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. తాజాగా విజయవాడ పట్టణంలో 9 మంది వ్యభిరాణిలతో పాటు ముగ్గురు నిర్వాహకు

అందమైన యువతుల శరీరాలతో కొందరు అక్రమ సంపాదనకు శ్రీకారం చుట్టారు. అంటే... అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. తాజాగా విజయవాడ పట్టణంలో 9 మంది వ్యభిరాణిలతో పాటు ముగ్గురు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పోలీసులు, సీఐడీ విభాగం సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో వారు చిక్కారు.
 
విజయవాడ రెండో పట్టణం, సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దాడులు నిర్వహించి అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. అలాగే, కొత్తపేట శిల్పారామం వీధిలో చల్లా జ్యోతి అనే మహిళ విజయవాడ నగరంతో పాటు గుంటూరు నుంచి ముగ్గురు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం రొంపిలోకి దింపింది. 
 
జక్కంపూడి కాలనీకి చెందిన సయ్యద్‌ యాస్మిన్‌ భవానీపురానికి చెందిన యువతిని తీసుకొచ్చి వ్యభిచారంలోకి దింపాడు. ఆర్ధిక ఇబ్బందులు, డబ్బు ఆశ చూపించి ఈ యువతులను ఈ వృత్తిలోకి దింపారని పోలీసులు నిర్ధారించారు. మొత్తం 8 మంది యువతులను సంరక్షించి ముగ్గురు నిర్వహకులను పోలీసులు అరెస్టు చేశారు.