బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2020 (16:59 IST)

పబ్‌జీ గొడవ.. పెద్దగా అరవకండ్రా బాబూ అన్నందుకు చంపేశారు..

కరోనా కారణంగా ప్రస్తుతం ఇంటిపట్టునే వుంటున్న విద్యార్థులకు ఆన్‌లైన్ గేమ్‌లపై మొగ్గుచూపుతున్నారు. పబ్జీ ఆటకు బానిసలై చాలా మంది ఇంట్లో తెలియకుండా డబ్బులు పోగొట్టుకున్నారు. మరికొంతమంది పబ్జీ ఆట కోసం ఫోన్‌ కొనివ్వలేదంటూ ప్రాణాలు తీసుకున్నారు. ఇంకొందరు పబ్జీ ఆట ఆడొద్దనందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. 
 
ఇప్పుడు పబ్జీ కోసం మరో ఘోరానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. పబ్జీ ఆడుతూ ముగ్గురు వ్యక్తులు  గోల చేస్తుండగా ఒక వ్యక్తి పెద్దగా మాట్లాడొద్దు అని హెచ్చరించాడు. రాజ్ కుమార్, బిక్రమ్ జీత్, రోహిత్ కుమార్ ఆన్‌లైన్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నారు. 
 
ఇంతలో దిలీప్ రాజ్ అనే వ్యక్తి పెద్ద శబ్ధాలు చెయ్యొద్దని కోరాడు. దాంతో కోపం వచ్చిన ఆ ముగ్గురు ఆ వ్యక్తిని హత్య చేశారు. ముందుగా దాడి చేశారని.. దీంతో దిలీప్ అక్కడికక్కడే మరణించాడని పోలీసులు చెప్పారు.