Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల కోసం వల వేస్తే కొండచిలువ పడింది

Written By ఎం
Updated: మంగళవారం, 11 ఆగస్టు 2020 (10:50 IST)
పుట్టెడు ఆశతో చేపలకు వెళ్లారు కొంతమంది యువకులు.. చాలా కాలం తర్వాత వేటకు వెళ్లడం వల్ల పట్టుకున్నన్ని చేపలు గ్యారెంటీ అనుకున్నారు. కానీ చేపల సంగతేమోగానీ.. వారికి భారీ కొండచిలువ పట్టుబడింది.
 
 మంగళవారం ఉదయం సమీపంలోని కొండవీటి వాగుకు వెళ్లిన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన యువకులు ఇది చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

చేపల కోసం వారు విసిరిన వలలో దాదాపు పది అడుగుల కొండ చిలువ పడింది. తొలుత చేప పడి ఉంటుందని భావించిన యువకులు నీటిలోనుంచి వలను బయటకు లాగగా  వలలో కొండచిలువ ప్రత్యక్షమైంది. అనంతరం వారు దానిని చంపేశారు. ఈ కొండ చిలువను చూడడానికి స్థానిక గ్రామస్తులు ఎగబడ్డారు.

అన్నీ చూడండి

KJQ విజయం సాధించి కిరణ్ కు ట్రిబ్యూట్‌గా నిలవాలి : శ్రీకాంత్ ఓదెల

Allu Arjun: స్నేహితులకు AA23 నిర్మాణబాధ్యతలు అప్పగించిన అల్లు అర్జున్

నెమ్మదించిన కెరీర్ - పెళ్లి పీటలెక్కనున్న బుట్టబొమ్మ

గ్లామర్ అంటే జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా? బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్న

తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్

తర్వాతి కథనం
Show comments