ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 సెప్టెంబరు 2024 (19:50 IST)

జగన్ సమావేశంలో సజ్జల.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆర్కే రోజా

RK Roja
RK Roja
అధికారంలో ఉనప్పుడు కీలకంగా ఉన్న మాజీ మంత్రి ఆర్కే రోజా, సజ్జల శాసన సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కొన్నాళ్లు అదృశ్యమయ్యారు. వీరిద్దరూ వేర్వేరుగా దేశ, విదేశాల్లో పర్యటించారు. 
 
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం చిత్తూరు జిల్లా నాయకులతో  పార్టీ అధినేత వైఎస్‌ జగన్ నిర్వహించిన సమావేశానికి వారిద్దరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 
గతంలో లేనట్టు ప్రత్యేక లుక్‌లో ఆమె కనిపించారు. అధికారం కోల్పోవడానికి సజ్జల కూడా ఒక కారణమని.. ఆయన్ను పక్కన పెట్టారని జరుగుతున్న ప్రచారానికి తాజాగా జరిగిన సమావేశం తప్పని నిరూపించింది. ఆయన జగన్‌తో ఉన్నారని స్పష్టమైంది.