బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

జగన్ వల్ల వైకాపా ఓడిపోలేదు ... సకల శాఖామంత్రి : అధికార ప్రతినిధి (Video)

ycp leaders
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని ఐదేళ్ళపాటు అధికారంలో ఉన్న వైకాపా గత ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఆ పార్టీ నేతలు ఇపుడు దిక్కులు చూస్తున్నారు. పైగా, ఓ ఘోర ఓటమికి కారణం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని, కాదు కాదు సకల శాఖామంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, విశాఖను కబ్జా చేసిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అంటూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి చెందిన సొంత టీవీ చానెల్‌లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
గత ఎన్నికల్లో వైకాపాకు చావు దెబ్బలాంటి ఓటమికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదని, ఐదేళ్లపాటు సకల శాఖామంత్రిగా, షాడో ముఖ్యమంత్రిగా, రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ ప్రజల్లో మంచి అభిమానం ఉందని ఆయన చెప్పారు. సకల శాఖామంత్రి వంటి రాజ్యాంగేతరశక్తుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.