గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (15:05 IST)

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి మృతి

చిత్తూరు జిల్లా రహదారులు రక్తమోడాయి. గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విగత జీవులుగా మారారు. అది కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తుండగా ప్రమాదం జరిగింది.

చిత్తూరు జిల్లా రహదారులు రక్తమోడాయి. గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విగత జీవులుగా మారారు. అది కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఐదుమంది స్నేహితులు తిరుమల శ్రీవారి దర్శనార్థం బుధవారం రాత్రి కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును రేణిగుంట సమీపంలోని వెదళ్ళచెరువు వద్ద లారీ ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో ప్రేమ్ సుందర్, కిషన్‌ రెడ్డి, హనుమంత రెడ్డిలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషయమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ లారీని అతి వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.