సోమవారం, 16 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 అక్టోబరు 2024 (16:14 IST)

సజ్జల రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం వుంది: ఏపీ డిజిపి

sajjala ramakrishna reddy
వైసిపి హయాంలో పనిచేసిన పలువురు నేతలను పోలీసు కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురుని అరెస్టు చేసారు. తాజాగా వైసిపి ప్రభుత్వ హయాంలో సలహాదారుగా పనిచేసిన మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డగించారు.

ఆయనపై లుకవుట్ నోటీసులు వుండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులను సజ్జలను అడ్డుకున్నారు. దీనిపై ఏపీ డిజిపి ద్వారకా తిరుమలరావు స్పందిస్తూ... సజ్జలపై గతంలో గుంటూరు ఎస్పీ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం వున్నదని వివరించారు.
 
లుకౌట్ నోటీసులపై తనకు ఎలాంటి సమాచారం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఐనా తను విదేశాల నుంచి సోమవారం నాడు తిరిగి వచ్చాననీ, ఇప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లబోతుంటే అడ్డగించారంటూ చెప్పుకొచ్చారు.