రమ్యను హత్య చేసిన శశి కృష్ణ మీడియా ముందుకు...
బిటెక్ విద్యార్థిని రమ్యతో ఆ ప్రేమోన్మాదికి పరిచయం కేవలం 6 నెలలే. ఇస్టాలో పరిచయం అయ్యాడు. ప్రేమ అని వెంట పడ్డాడు. నిరాకరణతో ఇలా హత్యా ఘాతుకానికి పాల్పడ్డాడు. రమ్య శ్రీ హత్య కేసులో ముద్దాయిని గుంటూరు అర్బన్ పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు.
గుంటూరు రమ్య హత్యోదంతాన్ని ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ వివరించారు. ఇన్ స్టాగ్రామ్ లో గత 6 నెలల క్రితం శశికృష్ణకి రమ్యతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి శశికృష్ణ రమ్యని తాను చదువుతున్న కాలేజ్ వద్ద కలుస్తూ, ప్రేమిస్తున్నానని వేధించాడు. ప్రేమకు ఆమె నిరాకరించడంతో శశికృష్ణ ఈ ఘతుకానికి ఒడిగట్టాడు.
మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ హెచ్చరించారు. సోషల్ మీడియా పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని, సోషల్ మీడియాలో పరిచయం అయ్యే వ్యక్తులకు దూరంగా ఉండాలని సూచించారు. దీనికి రమ్య హత్య ఒక ఉదాహరణగా నిలుస్తుందన్నారు. రమ్య హత్య కేసులో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, ఈ కేసులో ప్రతిభ కనపరచిన పోలీసులకు రివార్డులు ప్రకటించారు.