శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (14:31 IST)

నడి రోడ్డుపై రేప్ చేయిస్తా : కుమార్తెకు తండ్రి వార్నింగ్

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కుమార్తెకు తేరుకోలేని షాకిచ్చారు. నడి రోడ్డుపై రేప్ చేయిస్తానంటూ బెదిరించాడు. దీంతో ఆ యువతి మరో మార్గం లేక పోలీసులను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ యువతి తన తండ్రిపైనే ఫిర్యాదు చేసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబరు 10లో ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. 
 
అయితే, ఇల్లు వదిలి ఎటైనా వెళ్లిపోవాలంటూ ఆమె తండ్రి యువతిపై కొంత కాలంగా ఒత్తిడి చేస్తున్నాడు. లేదంటే అత్యాచారం చేయిస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఇంటికి వచ్చిన తండ్రి.. తన భార్య, కుమార్తెతో గొడవకు దిగాడు.
 
తన తల్లి పేరుతో హైదరాబాద్‌లోనే కొంత ఆస్తి ఉండగా దానికి సంబంధించి నెల నెలా అద్దె వస్తుంటుంది. అయితే ఆ అద్దెను కూడా తన తండ్రే వసూలు చేసుకొని వినియోగించుకుంటున్నాడు. 
 
తమ డబ్బులు వాడుకుంటూ తమపై దాడికి దిగుతున్నాడని, ఇదేంటని ప్రశ్నిస్తే అత్యాచారం చేయిస్తానంటూ బెదిరింపులు చేస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు.