శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 14 ఆగస్టు 2021 (18:23 IST)

హీరో నిఖిల్‌ను సన్మానించిన పోలీస్ కమీషనర్ సజ్జనార్

Nikhil, Sajjanar
వరస విజయాలతో జోరు మీదున్న టాలీవుడ్ హీరో నిఖిల్‌ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ సన్మానించారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఈయన చేసిన సేవలను గుర్తించిన సజ్జనార్, ఆయన్ని గౌరవించారు. కరోనా సమయంలో చాలా మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు నిఖిల్. కోవిడ్ సమయంలో ఈ హీరో చేసిన సేవలను గుర్తించి సజ్జనార్ అతన్ని సన్మానించారు. 
 
అలాగే నిఖిల్‌లోని మానవతా దృక్పతాన్ని సజ్జనార్ మెచ్చుకున్నారు. కష్టసమయంలో ఎంతోమందికి సాయం చేసిన నిఖిల్.. చాలా మందికి స్పూర్తిగా నిలిచారని తెలిపారు సజ్జనార్. సెకండ్ వేవ్‌లో ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న వాళ్లకు డబ్బు సాయం కూడా చేసారు నిఖిల్. అలాగే అవసరాలు తెలుసుకుని సాయపడ్డారు. మెడికల్ కిట్స్‌తో పాటు కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు నిఖిల్. ఎంతోమంది ప్రాణాలు కాపాడటానికి సాయపడ్డారు ఈయన. దాంతో పోలీస్ కమీషనర్ సజ్జనార్ ప్రత్యేకంగా నిఖిల్‌ను సన్మానించారు.