శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 11 సెప్టెంబరు 2021 (18:44 IST)

స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ల అవగాహన మాసోత్సవాలు

సెప్టెంబ‌ర్ నెల స్త్రీల‌కు ప్ర‌త్యేకం... స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ల అవగాహన మాసోత్సవాలు గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో ప్రారంభం అయ్యాయి. సెప్టెంబర్ మాసాన్నిస్త్రీ జననేంద్రియ క్యాన్సర్ల మాసంగా మంగళగిరి ఎయిమ్స్ అధికారులు పరిగణించి ప్రత్యేక  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ మాసోత్సవాల్లో భాగంగా ముఖ్యంగా మహిళల్లో వచ్చే అయిదు జననేంద్రియ క్యాన్సర్ల  పై ఎయిమ్స్ గైనకాలజీ వైద్యాధికారులు మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మంగళగిరి ఎయిమ్స్ కు వచ్చే మహిళలకు జననేంద్రియ క్యాన్సర్ల కు సంబందించిన కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు వాటి ల‌క్షణాలు, నివారణా మార్గాలపై వివరిస్తున్నారు.

ఈ  అయిదు క్యాన్సర్లను ముందుగా గుర్తించడం వల్ల వాటిని నివారించడం తో పాటు  ప్రాణాలను కాపాదుకోవచ్చని  అని మంగళగిరి ఎయిమ్స్ గైనకాలజీ వైద్య విభాగం హెచ్.ఓ.డి. డాక్టర్. షర్మిల తెలిపారు. సెప్టెంబర్ నెల మొత్తం అయిదు స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లకు మహిళల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.