బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2020 (09:01 IST)

జగన్ ఇంట తీవ్ర విషాదం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గంగిరెడ్డి శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు.

కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు.

2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు.