రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం వస్తోందని, 6, 7 నెలలుగా దేవాలయాలపై, రథాలపై, గోపురాలపై, దేవాలయ కట్టడాలపై దాడులుజరుగుతుంటే, మంత్రులు పిచ్చిపిచ్చి ప్రేలాపనలుచేస్తున్నా ముఖ్యమంత్రి కట్టడి చేయడంలేదని, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు చూస్తుంటే, ప్రభుత్వమే వాటిని చేయిస్తున్నట్టు అనిపిస్తోందని టీడీపీనేత రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అభిప్రాయపడ్డారు.
గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఒక చర్చిపైరాళ్లు వేశారన్న నెపంతో 41మందిపై కేసులుపెట్టిన ప్రభుత్వం, హిందూదేవాలయాలపై దాడులు చేస్తున్నవారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు? పాలకులు ఏమతానికి చెందిన వారైనా, హిందూమతంపై, దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఎందుకు నిరోధించలేకపోతున్నారని ఆనంద్ సూర్య ప్రశ్నించారు.
పోలీసులు తమవిధినిర్వహణ చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారన్న ఆయన, కక్షసాధింపు ధోరణితో పాలన చేయడమేంటన్నారు? విగ్రహాల చేతులు విరిగితే ఏమైందంటున్న నానీ, తన వ్యాఖ్యలతో భక్తులకు తీరనిధ్రోహం చేస్తున్నాడని వేమూ రి ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడాలినానీ పెళ్లిచేసుకున్నప్పుడు మూడుముళ్లు ఎందుకు వేశాడని, ఏ యాక్ట్ ప్రకారం ఆయన ఆపని చేశాడో చెప్పాలన్నారు.
తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదని నానీ ఎలా చెబుతాడని ఆనంద్ సూర్య ప్రశ్నించారు. 1890లో విలియం కేన్స్ అనే బ్రిటీష్ రాజకీయవేత్త, బాప్టిజం స్వీకరించినవ్యక్తి రాసిన పుస్తకంలో కూడా అన్యమతస్తులు మేజిస్ట్రేట్ దగ్గర అనుమతితీసుకున్నాకే స్వామి వారిని దర్శించాల్సి ఉంటుందని పేర్కొన్నాడన్నారు.
ఆనాడు దిగువతిరుపతిలో ఉండే మేజిస్ట్రేట్ దగ్గర అనుమతి తీసుకొని, స్వామివారిపై తమకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయని చెప్పాకే, అన్యమతస్తులను ఎగువతిరుపతిపైకి అనుమతించడం జరిగేదని కేన్స్ తన పుస్తకంలో రాశాడన్నారు. దాదాపు 135 ఏళ్ల క్రితమే ఇటువంటి నిబంధనఉందనే విషయాన్ని మంత్రి కొడాలినానీ తెలుసుకోవాలన్నారు.
క్రైస్తవుడైన జగన్, నిన్న తిరుమల వెళ్లినప్పుడు మూడునామాలు ఎందుకుపెట్టాడో, ఎవరుచెబితే పెట్టాడో సమాధానం చెప్పాలన్నారు. హిందూభక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉందన్నారు. గతంలో పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని దుష్ప్రచారంచేసినవ్యక్తి, ఆగమశాస్త్ర సలహాదారు, ప్రధానార్చకుడైన రమణదీక్షితులు ఇప్పుడేం చేస్తున్నాడన్నారు.
ఆనాడు పింక్ డైమండ్ గురించి మాట్లాడిన వ్యక్తి, ఇప్పుడెందుకు జగన్ చర్యలపై నోరెత్తడం లేదన్నారు. సాంప్రదాయాలను, ఆలయ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ పై ఉందనే మాట రమణదీక్షితులు ఎందుకు అనడం లేదన్నారు. 01-07-2020 నుంచి ప్రభుత్వం పెంచాల్సిన పింఛన్ల గురించి, కొడాలినానీ, రోజాలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
జగన్ ఫోటోలపై, నానీ చిత్రాలపై పేడవేస్తే, వారు ఊరుకుంటారా అని వేమూరి నిలదీశారు. అసందర్భమైన ఆలోచనలతో, చేసిన పొరబాట్లను కప్పిపుచ్చుకునేందుకు, సమాజాన్ని, హిందూ మతాన్ని బలిచేయవద్దని ప్రభుత్వపెద్దలకు సూచిస్తున్నానన్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రం గౌరవమర్యాదలు కాపాడకుండా, మదగజబలంతో, 150 సీట్లున్నాయన్న అహంకారంతో, ప్రజాపాలన చేయలేక, ఫ్యాక్షన్ పాలన సాగిస్తున్నారని ఆనంద్ సూర్య మండిపడ్డారు.
హిందూమతంపై వైసీపీనేతలు దాడిచేస్తూ, మోదీనిగురించి మాట్లాడటం ఏమిటన్నా రు? రామజన్మభూమి శంఖుస్థాపన సమయంలో ఆయన పక్కన ఎవరున్నారంటున్న వైసీపీనేతలు, నిన్న తిరుమల వెళ్లినప్పుడు జగన్ పక్కన ఎవరున్నారో చెప్పాలన్నారు. మోదీ ఆనాడు వేదికపై ఆరెస్సెస్ ఛీప్, యూపీ సీఎంలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నా రన్నారు.
సుశీల్ షింగాల్, మాధవీ షింగాల్ గార్లతోనే మోదీ శంఖుస్థాపన కార్యక్రమంచేయించిన విషయాన్ని కొడాలినానీ, వెల్లంపల్లి తెలుసుకోవాలన్నారు. మంత్రులు, వైసీపీనేతలు కుట్రలతో హిందూమతవ్యతిరేక పాలన తీసుకొచ్చే ఆలోచన చేయకుండా, ప్రజాస్వామ్యయుతంగా పాలన చేస్తే మంచిదని ఆనంద్ సూర్య సూచించారు.
మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి బార్లకుఎందుకు అనుమతించారో కొడాలినానీ సమాధానం చెప్పాలన్నాడు. నానీ దమ్ము, ధైర్యముంటే, ప్రజలకు పెంచాల్సిన పింఛన్, ఇతరేతర సమస్యలపై ముఖ్యమంత్రితో కొట్లాడితే అందరూ సంతోషిస్తారన్నారు.