బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (21:40 IST)

టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన జ‌గ‌న్‌

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన బుధ‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టిటిడి ముద్రించిన 2021వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆలయంలో ఆవిష్కరించారు. 
 
12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 75 వేలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టిటిడి ముద్రించింది.

ఇవి సెప్టెంబ‌రు 28వ తేదీ నుండి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉంటాయి. అక్టోబ‌రు రెండో వారం నుండి ఇత‌ర ప్రాంతాల్లోని టిటిడి స‌మాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.