గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 జులై 2020 (09:01 IST)

నేటి నుంచి గుంటూరులో మధ్యాహ్నం 12 వరకే దుకాణాలకు అనుమతి

గుంటూరుజిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వ్యాపార సంస్థలు శుక్రవారం నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకునేందుకు గుంటూరు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు వచ్చినందున అందుకు అనుమతి మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఐ. శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు.

ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలుకు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే శుక్రవారం నుండి అనుమతించడం జరుగుతుందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలు ఎవ్వరూ అనవసరంగా బయటకు రాకూడదన్నారు.

అత్యవసరంగా బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారు తప్పని సరిగా మాస్కులు ధరించాలన్నారు. బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం పాటించాలన్నారు. ద్విచక్ర వాహనంపై ఒక్కరు మాత్రమే ప్రయాణించాలన్నారు. 

కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు ప్రతి ఒక్కరూ తరచూ చేతులు శానిటైజ్ చేసుకుంటూ, అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.