Webdunia - Bharat's app for daily news and videos

Install App

చ‌చ్చింద‌ని ప‌ట్టుకోబోతే... కాటేసి ప్రాణం తీసింది!

Written By జెస్కే
Updated: సోమవారం, 5 జులై 2021 (15:13 IST)
ఇత‌ని పేరు రంగ‌స్వామి... చాక‌చ‌క్యంగా పాములు ప‌ట్టేవాడు... కానీ, ఈ పాము న‌ట‌న‌కు రంగ‌స్వామి బ‌ల‌య్యాడు. చనిపోయిందని రంగ‌స్వామి పట్టుకోబోతే.. కాటేసి ప్రాణం తీసింది. 
 
క‌ర్నూలు జిల్లా మాలపల్లి గ్రామంలోని పాఠశాల వద్ద ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. పాఠ‌శాల వ‌ద్ద పాము కనిపించడంతో జనం వెంటనే పాములు పట్టే రంగస్వామికి సమాచారం అందించారు. అతను అక్కడికి చేరుకుని పామును ముందుగా కర్రతో కొట్టాడు. 
 
ఆ ప్రాంతంలో ఎవరింట్లో పాము కనిపించినా అతడికే కబురు పెడతారు. చాకచక్యంగా పాములు పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేస్తుంటాడు. అలాంటి రంగ‌స్వామి ఈ సారి...ఇది విష‌పు పాము అని క‌ర్ర‌తో కొట్టాడు. అది చ‌చ్చిన‌ట్లు ప‌డి ఉండ‌టంతో... ఏం ఫ‌ర‌వాలేద‌ని చేతితో ప‌ట్టుకోబోయాడు. అంతే... చివాలున లేచి పాము కాటేసింది. పాము చనిపోయిందని భావించి పట్టుకోవడానికి ప్రయత్నించగా...ఇలా ఒక్కసారిగా కాటేసింది. 
 
దీంతో రంగ‌స్వామి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉలిక్కిపడిన స్థానికులు రంగస్వామిని వెంటనే చికిత్స నిమిత్తం ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు.

అన్నీ చూడండి

Hanuman Ansh: కాంతార, ది కాశ్మీర్ ఫైల్స్‌ను వెనక్కి నెట్టిన హనుమాన్ అన్ష్

ఏవియేషన్ రంగం నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేస్తున్న ప్రార్థనా చాబ్రియా

మహిళల భావోద్వేగాల అంశంతో హ్యాపీ జర్నీ చిత్రం విడుదలకు సిద్ధం

Allu Aravind: అల్లు అర‌వింద్ పై యశ్ మ‌ద‌ర్ విమర్శించడంలో పసలేదు

మణిశర్మ సంగీతం హైలైట్ గా గజ సినిమా విజయం ఖాయం : సాయి రాజేష్

తర్వాతి కథనం
Show comments