శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (18:05 IST)

షర్మిళ సభకు వెళ్ళొచ్చిన వారిలో కరోనా పాజిటివ్ వ్యక్తులు, ఇంకొందరిని పట్టుకుంది...

షర్మిళ పాదయాత్ర కాస్త కొంపముంచింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో షర్మిళ పాదయాత్ర చేపట్టడం.. ఆ పాదయాత్రలో కరోనా సోకిన వారు ఉండటంతో అది కాస్త అందరికీ వ్యాపించి చివరకు పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. 
 
షర్మిళ సభకు వెళ్ళొచ్చిన కొంతమందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఖమ్మం సభకు వెళ్ళొచ్చిన వారికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందట. ఆ కొందరు నేతలు కూడా హోంఐసోలేషన్లో ఉన్నారట. ప్రైవేటు ఆసుపత్రిలో కొంతమంది షర్మిళ అనుచరులు చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో షర్మిల పరిస్థితి ఏంటా అని ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.