మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 3 ఆగస్టు 2021 (09:59 IST)

రేపు ఢిల్లీకి సోము వీర్రాజు, ఏం మంట పెడ‌తారో?

మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు రేపు ఉదయం బయలుదేరనున్నారు. సోము వీర్రాజు నేతృత్వంలోని రాష్ట్ర నేతలు అంతా క‌లిసి కేంద్ర జలశక్తి శాఖ  మంత్రి గజేంద్ర షేకావత్' తో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు, ఆర్. ఆర్. ప్యాకేజీ, ప్రాజెక్టు కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు చర్చించనున్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి రేపు ఉదయం ఢిల్లీ'కి పయనమ‌వుతున్న‌ట్లు సోము వీర్రాజు తెలిపారు.
 
సోము వీర్రాజు బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలసి గందరగోళంలో ఉన్న ఏపీ ఆర్ధిక పరిస్థితులపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను కూడా కలవనున్నారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను, ఎగుమతులు అంశాలను మంత్రి దృష్టికి తీసుకురానున్నారు.

రైల్వే శాఖామంత్రి అశ్వని వైష్ణవి'తో భేటీ అయి ఏపీ లో రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్ అభివృద్ధి అంశాలు చర్చించనున్నారు. కేంద్ర రైల్వే శాఖ ఆమోదం పొంది, నిధులు కేటాయించినా, రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించని అంశాలు, కొత్త రైల్వే లైను కొవ్వూరు - భద్రాచలం అంశంపై రైల్వే మంత్రి దృష్టికి తీసుకురానున్నారు. 
 
మంత్రుల‌తో భేటీ అనంత‌రం సోము వీర్రాజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాను క‌లుస్తారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరిగిన పార్టీ కార్యక్రమాలు, పార్టీ విస్తరణ, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలపై నివేదించనున్నారు.