ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , సోమవారం, 30 ఆగస్టు 2021 (16:12 IST)

తుని త‌పోవ‌నంలో క‌న్నుల పండువ‌గా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

శ్రీకృష్ణ జ‌న్మాష్ట‌మికి క‌రోనా అడ్డొచ్చింది. దీని వ‌ల్ల వీధుల్లో కోలాహ‌లం, ఉట్టికొట్టే సంద‌డి త‌గ్గిపోయింది. అయితే, కొన్ని చోట్ల ఈ కార్య‌క్ర‌మం అద్భుతంగా నిర్వ‌హిస్తున్నారు. చిన్ని కృష్ణుల‌ను త‌యారుచేసి, వారితో ఉట్టి కొట్టించి సంబ‌రాలు చేస్తున్నారు.
 
తూర్పు గోదావరి జిల్లా తుని శివారు తాండవ నది తీరంలో ఉన్న సచ్చిదానంద తపోవనం ఆశ్రమంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ముందుగా గోపాలనుకి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఆశ్రమ పీఠాధిపతులు సరస్వతి స్వామీజీ అందజేశారు. అనంతరం ఆశ్రమంలో గోవులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి   హారతులు అందజేశారు.

చిట్టి పొట్టి దుస్తులు ధరించి శ్రీకృష్ణుడు గోపికల వేష ధారణలతో ఉట్టి కొట్టే కార్యక్రమంతో పాటు పలు ఆధ్యాత్మిక సంగీతాలకు నృత్యాలు చేసి చిన్నారులు పలువురిని అలరించారు.