తిరంగ్ మార్చ్ : ఘనంగా కిసాన్ మజ్దూర్ ఆజాది సంగ్రామ్ దివస్
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపు మేరకు 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా రైతులు 'కిసాన్ మజ్దూర్ ఆజాది సంగ్రామ్ దివస్'గా జరిపారు. ఇందులోభాగంగా తిరంగ్ మార్చ్‌లు నిర్వహించారు.
ట్రాక్టర్లు, కార్లు, ట్రాలీలు, ద్విచక్రవాహనాలు, సైకిళ్లు, ఆటోలు, ఇతర వాహనాలకు జాతీయ జెండాలను కట్టి మార్చ్ నిర్వహించారు. దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులోని సింఘూ సరిహద్దు వద్ద ప్రముఖ రైతు నాయకుడు సత్నామ్ సింగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
దేశవ్యాప్తంగా కిసాన్ మజ్దూర్ ఆజాదీ సంగ్రామ్ దివస్‌ను నిర్వహించినట్లు రైతు నేత కుల్వంత్ సింగ్ తెలిపారు. మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లతో నవంబర్ నుంచి రైతు ఉద్యమం కొనసాగుతున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ కిసాన్ మజ్దూర్ ఆజాదీ సంగ్రామ్ దివస్ ఘనంగా జరిగింది. ట్రాక్టర్లు, బైక్‌లు, సైకిళ్లు, ఎద్దుల బళ్లకు జాతీయ జెండాలు కట్టి రైతులు, కార్మికులు తిరంగ్ మార్చ్ జరిపారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్, హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ రైతులు తిరంగ్ మార్చ్‌లు నిర్వహించారు.