శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 13 ఆగస్టు 2021 (23:00 IST)

అంతర్జాతీయ యూత్‌ డే 2021 సందర్భంగా #YoungWarriorNXT పేరుతో మరో ఉద్యమం

అంతర్జాతీయ యువజన దినోత్సవం 2021 సందర్భంగా, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ (MoYAS), ఐక్యరాజ్యసమితి ఇతర శాఖలైనటువంటి (UNICEF, UNFPA, UNDP, UNV, UN Women, UN AIDS, UNHCR, WHO మరియు ILO) మరియు YuWaah (జనరేషన్ అన్‌లిమిటెడ్ ఇన్ ఇండియా) #YoungWarrior ఉద్యమం రెండో దశని #YoungWarriorNXT అనే పేరుతో మొదలుపెడుతోంది. కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి ఉషా శర్మ, సైయంట్‌ ఫౌండర్‌-ఛైర్మన్‌ మరియు బోర్డ్‌ మెంబర్‌, యువా అడ్వైజరీ బోర్డ్‌ మెంబర్‌ అయినటువంటి శ్రీ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, ఐక్యరాజ్యసమితి రెసిడెంట్‌ కో-ఆర్డినేటర్‌ ఆఫ్‌ ఇండియా యువా మరియు శ్రీ రెయిడ్రే బాయిడ్‌ ఆధ్వర్యంలో సెలబ్రేటింగ్‌ యూత్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ రెసిలెన్స్‌ కాన్సెప్ట్‌తో ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు.
 
#YoungWarrior ఉద్యమాన్ని 2021 మేలో అంటే... కోవిడ్‌ 19 మహమ్మారి రెండో దశ ఉదృతంగా ఉన్న సమయంలో మొదలుపెట్టారు. ఈ ఉద్యమంలో 10 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు యువకులంతా పాల్గొన్నారు. పాల్గొనడమే కాకుండా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారి కోసం ఎన్నో సేవలు అందించారు. వారి కోసం వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లు ఏర్పాటు చేయడం, కమ్యూనిటీలకు కావాల్సిన వస్తువులు అందేలా చూడడం, కౌన్సెలింగ్‌, కోవిడ్‌ అపోహల తొలగింపు లాంటి కార్యక్రమాలను అద్బుతంగా నిర్వర్తించారు. ఈ ఉద్యమం అద్భుతమైన రీతిలో సాగింది. దాదాపు 6.6+ మిలియన్ల మందికి పైగా చేరువైంది. 7600కి పైగా వర్కషాప్స్‌ నిర్వహణ, 140000 మందికి పైగా టీచర్లు ఇతర స్టేక్‌ హోల్డర్స్‌, ఇతర మాస్‌ మీడియా క్యాంపెయిన్‌ ద్వారా దాదాపు 500 మిలియన్‌కు పైగా చేరువయ్యేలా చేశారు. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా 1350కి పైగా పబ్లిక్‌ మరియు ప్రైవేట్‌ భాగస్వాములు, ఐక్యరాజ్యసమతి సంస్థలు, అకడమిక్‌ ఇనిస్టిట్యూషన్స్‌ మరియు సివిల్‌ సొసైటీ సంస్థలు మద్దతుగా నిలవడంతో.. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా విజయవంతం అయ్యింది.
 
#YoungWarrior ఉద్యమం విజయవంతం కావాడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే అందులో ముఖ్యమైనది మరియు ప్రధానమైనది కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ (MoYAS) మరియు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ (MoHFW), కేంద్ర విద్యాశాఖ, (MoE), కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ మరియు ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ(MeitY). వీటితో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), జాతీయ సోషల్ సర్వీస్ (NSS), నెహ్రూ యువ కేంద్ర సంఘం (NYKS), నేషనల్ క్యాడెట్ కార్ప్ (NCC), భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG), UN ఏజెన్సీలు మరియు పౌర సమాజ సంస్థల కృషి ఎంతగానో ఉంది.
 
#YoungWarrior ఉద్యమం అద్భుతమైన విజయం సాధించడంతో దాన్ని ప్రేరణగా తీసుకుని ఇప్పుడు ఈ ఉద్యమం తాలూకూ రెండో దశ అంటే… #YoungWarriorNXT పేరుతో నిర్వహిస్తున్నారు. కోవిడ్‌ 19, దాని తర్వాత విధించిన లాక్‌డౌన్‌ పరిణామాలతో కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ రెండో దశ ఉద్యమం ద్వారా భవిష్యత్‌కు కావాల్సిన నైపుణ్యాన్ని పెంపొదించుకోవడం పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. #YoungWarriorNXT కార్యక్రమం ఈ ఏడాది పొడవునా జరుగుతుంది. దీనిద్వారా భారతదేశంలోని 14 మరియు 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులను విజయవంతమైన కెరీర్‌లను కొనసాగించడానికి కావాల్సిన ఉపాధి నైపుణ్యాలను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
ఇందులో భాగంగా ప్రధానంగా 5 అంశాలపై దృష్టి సారించారు. స్వీయ-అవగాహన, సహకారం, సమస్య పరిష్కారం, కమ్యూనికేషన్, మరియు నిర్ణయం తీసుకోవడం, వృత్తి శిక్షణ మరియు ఉద్యోగ-సంసిద్ధత నైపుణ్యాలపై ప్రధానంగా దృష్టి పెడతారు. దీంతోపాటు కీలకమైన నేర్చుకునే కమ్యూనిటీపై ఏర్పడిన కోవిడ్‌ -19 మానసిక-సామాజిక ప్రభావాన్ని గుర్తిస్తారు. వీటితోపాటు మానసిక ఆరోగ్యం మరియు భావోద్వేగ శ్రేయస్సును పరిష్కరించే కార్యక్రమాలు కూడా ఇందులో ఉంటాయి.
 
ఈ సందర్భంగా కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి (యువజన వ్యవహారాలు) శ్రీమతి ఉషా శర్మ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ… మన దేశ అభివృద్ధికి యువతే చాలా కీలకం. మార్పు వారితోనే సాధ్యం. అందుకే 21 వ శతాబ్దంలో వేగంగా మారుతున్న అవసరాలను స్వీకరించడానికి అవసరమైన సాధనాలు మరియు నైపుణ్యాలను వారికి అందించాలి. ఇందుకోసం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సామాజిక బాధ్యత కలిగిన నాయకులకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది అని అన్నారు.
 
యువత నాయకత్వం వహిస్తే ఏదైనా సాధ్యమని.. గొప్ప నాయకత్వం లక్షణాలు వారికి ఉన్నాయని #YoungWarrior ఉద్యమం మాకు ప్రత్యక్షంగా చూపించింది. ఇప్పుడు ఈ #YoungWarriorNXT యువతకు తమ ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, అలాగే వారి భవిష్యత్తును మార్చే కెరీర్‌ని ఎంపిక చేసుకోవడానికి, నాయకులుగా మరింత ఎదిగేందుకు అవకాశాన్ని అందిస్తుంది అన్నారు భారతదేశంలో ఐక్యరాజ్యసమితి రెసిడెంట్‌ కో-ఆర్డినేటర్‌ బాయిడ్.
 
ఈ సందర్భంగా భారతదేశంలో యూనిసెఫ్‌ ప్రతినిధి మరియు యువా కో ఛెయిర్‌ డాక్టర్‌ యాస్మిన్‌ అలి హక్‌ మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువమంది యువకులు ఉన్న దేశం. అంతేకాదు రాబోయే 20 ఏళ్లు కూడా అలాగే ఉండబోతోంది. #YoungWarriorNXT కార్యక్రమం యువతకు అవసరమైన జీవిత నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. సాధారణ ఫోన్, స్మార్ట్‌ఫోన్ లేదా DIY హోమ్ కిట్‌ల ద్వారా యువత ఈ నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. యువా, యునిసెఫ్ మరియు మా భాగస్వాములు దేశంలో అత్యంత అట్టడుగున ఉన్నవారితో సహా అత్యధిక జనాభా కలిగిన యువకులను కూడా చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అని అన్నారు.
 
ఈ సందర్భంగా సైయంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్ మరియు బోర్డు సభ్యుడు మరియు యువా సలహా బోర్డు సభ్యుడు శ్రీ డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. మహమ్మారి యువకుల జీవితాలను ప్రభావితం చేసింది,.  కానీ అదే సమయంలో భారతదేశాన్ని పునర్నిర్మించడంలో వారి సహకారమే చాలా కీలకం. అదే చాలా విస్మయం కలిగిస్తుంది. అందుకే మేము యువకుల అభ్యాసం మరియు నైపుణ్యాల పెంపుపై దృష్టి పెట్టాం. వారి భవిష్యత్తు కోసం అవసరమైన ఉపాధి సామర్థ్యాలతో వారిని సిద్ధం చేయాలి. #YoungWarrior యొక్క ప్రభావాన్ని చూసిన తర్వాత, ప్రైవేట్‌తో పాటు ఇతర రంగాలలోని నా సహచరులు మరియు వాటాదారులు #YoungWarriorNXT కోసం కలిసి రావాలని నేను కోరుతున్నాను, తద్వారా మా యంగ్ యోధులు యువ నాయకులుగా తమ పాత్రను బలోపేతం చేసుకోవచ్చు అని అన్నారు ఆయన.
 
ఈ సందర్భంగా మాట్లాడారు ది అసోసియేషన్‌ ఫర్‌ యూత్‌ వెల్‌బీయింగ్‌ డైరెక్టర్‌, 15 ఏళ్ల గౌరి నింబాల్కర్‌. ఎన్నో ఏళ్లుగా నేర్చుకున్న నైపుణ్యానికి మహమ్మారి విఘాతం కలిగించింది. దీంతో భవిష్యత్తు ఎలా అనే భయం మమ్మల్ని ఆందోళనకు గురిచేసింది. అదే సమయంలో మన జీవితాలను మనం ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే దిశానిర్దేశం చేసింది ఈ కార్యక్రమం. ఇప్పుడు #YoungWarriorNXT ద్వారా, నా కమ్యూనికేషన్ మరియు పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నాను. అది నా చదువు మరియు భవిష్యత్తు కెరీర్‌లోనే కాకుండా నా వ్యక్తిగత జీవితంలో కూడా సహాయపడుతుంది అని అన్నారు.
 
ఈ సందర్భంగా యువా నింజా ప్రైడ్‌ ఆఫ్‌ పంజాబ్‌, 22 ఏళ్ల సందీప్‌ సింగ్‌ మాట్లాడారు. మహమ్మారి మన మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరంతో పాటు కొత్త నైపుణ్యాలతో పెంపొందించుకునేలా చేసింది. నేను #YoungWarriorNXT లో చేరడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది కేవలం వృత్తిపరంగానే కాకుండా సర్వతోముఖ వ్యక్తిగా కూడా ముందుకు సాగడానికి నాకు సహాయపడుతుంది అని అన్నారు.