సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (10:59 IST)

మెర్సీ హోంలో విశాల్ బర్త్‌డే : అనాథలకు హీరో గోరుముద్దలు

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన పుట్టినరోజు వేడుకలను ఆదివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెన్నైలోని మెర్సీ హోంలో అనాథ పిల్లలతో గడిపారు. చిన్నారులకు స్వయంగా గోరుముద్దులు పెట్టారు. అలాగే పలువురు వృద్ధులకు కూడా ఆయన అన్నదానం చేశారు.
 
అంతేకాకుండా, తన అభిమాన సంఘాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు చీరలు, పంచెలు పంచి పెట్టారు. పేద మహిళల ఉపాధి కోసం కుట్టుమిషన్లు, నీటి బిందెలు, బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. అనాథలను గుర్తించి అనాథాశ్రమాల్లో చేర్చారు.
 
కాగా విశాల్‌ ఆదివారం ఉదయం స్థానిక కీల్పాక్కంలోని మెర్సీ హోమ్‌లోని వృద్ధులకు అన్నదానం చేశారు. స్థానిక కెల్లీస్‌లోని సురభి ఆశ్రమంలో అనాథ బాలల మధ్య కేక్‌ కట్‌ చేసి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. పిల్లలకు తన చేతితో అన్నం తినిపించి వారికి మధురానుభూతి కలిగించారు.