శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 ఆగస్టు 2021 (11:21 IST)

'సామాన్యుడు'గా వస్తున్న విశాల్

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ త్వరలోనే సామాన్యుడుగా రానున్నారు. ఆయన కొత్త చిత్రానికి సామాన్యుడు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను శనివారం రిలీజ్ చేశారు. 
 
యాక్షన్ హీరోగా విశాల్‌కి తమిళ, తెలుగు భాషలలో బాగా క్రేజ్ ఉంది. ఆయన నుంచి మాస్ అండ్ యాక్షన్ సినిమాలు ఎక్కువగా వచ్చి ఆకట్టుకుంటున్నాయి. 
 
ఈ క్రమంలో విశాల్ పుట్టన రోజు ఆగస్టు 29వ తేదీని పురస్కరించుకుని ఆయన హీరోగా రూపొందనున్న 'సామాన్యుడు' చిత్ర ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీనికి తు.పా. శరవణన్ దర్శకత్వం వహించనున్నాడు. 
 
ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్‌గా నటించబోతోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందివ్వనున్న ఈ మూవీ విశాల్ సొంత బ్యానర్‌లో తెరకెక్కబోతోంది.