బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 29 ఫిబ్రవరి 2020 (20:24 IST)

సినిమా ఫైటింగ్‌ను తలదన్నే రేంజ్‌లో కొట్టుకున్న శ్రీకాకుళం విద్యార్థులు

సినిమా ఫైటింగ్‌ను తలదన్నే రేంజ్‌లో కొందరు విద్యార్థులు ఎగిరెగిరి తన్నుకున్న భయంకర ఘటన శ్రీకాకుళంలో చోటు చేసుకుంది.

పాలకొండలోని ఓ కాలేజీలో జూనియర్‌ విద్యార్థిని సీనియర్ విద్యార్థి బైక్‌తో ఢీ కొట్టడంతో ఈ గొడవ ప్రారంభమైంది. ఈ ఫైటింగ్‌ వల్ల గంట సేపు ట్రాఫిక్ జామ్‌ అయింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. మెయిన్‌రోడ్డ వద్ద విద్యార్థులు సృష్టించిన బీభత్సానికి స్థానికులు భయపడిపోయారు.

వీధి రౌడీల్లా వారు కొట్టుకుంటోన్న తీరు పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పాలకొండ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.