బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (07:56 IST)

పగడ్బందీగా పరీక్షల నిర్వహణ:మంత్రి సురేశ్

సచివాలయంలో విద్యా సంబంధిత అంశాలపై మంత్రి ఆదిమూలపు సురేశ్..అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే పదవ, ఇంటర్ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు.

రాబోయే పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరగాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యా సంబంధిత అంశాలపైన మంత్రి.. అధికారులతో సమీక్షించారు.

అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహించాలని.... విద్యార్థులకు కావలసిన వసతులు కల్పించాలన్నారు. పదవ తరగతి ప్రశ్నపత్రంలో చేసిన మార్పులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీఈవోలు ఈ విషయం పై బాధ్యతగా వ్యవహరించేలా చూడాలన్నారు.

పరీక్షా కేంద్రాలు తెలిసేలా యాప్​ను అందుబాటులో ఉంచాలన్నారు. ఇంగ్లీష్ మీడియం అమలు చేయటంలో తీసుకోవలిసిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.