బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 జనవరి 2021 (19:13 IST)

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం ధ్వంసం

రాష్ట్రంలోని ఆలయాల్లో దేవుళ్ల విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. తాజాగా తూ.గో జిల్లా రాజమండ్రి శ్రీరామనగర్‌ విఘ్నేశ్వరాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉపాలయంలో స్వామివారి విగ్రహం రెండు చేతులను నరికివేశారు.

ఈ ఘటనపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల విజయనగరం జిల్లాలో శ్రీరాముడి విగ్రహం తలను ధ్వంసం చేశారు.
 
దేవుళ్లకు జరుగుతున్నఅవమానాలపై జగన్ రెడ్డి స్పందించాలి: అచ్చెన్నాయుడు
హిందూ దేవాలయాలపై జరుగతున్న వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. టీవీల ముందు, ప్రజల ముందు ఆ దేవుని దయతో అని చెప్పడం కాదు..దేవుళ్లకు జరుగుతున్న అవమానాలపై జగన్ రెడ్డి మాట్లాడాలి. మొన్నటి రామతీర్థం ఘటన మరువకముందే ఇప్పుడు రాజమండ్రిలో విఘ్నేశ్వరాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి చేతులు విరగొట్టారు.

జగన్ రెడ్డి మొద్దు నిద్ర వీడి హిందూ దేవాలయాల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి. ఏపీలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. మొదటి ఘటనలోనే ప్రభుత్వం చర్యలు చేపట్టి వుంటే ఇన్ని దాడులు జరిగేవి కాదు.

జగన్ పాలనలో ప్రజలకే కాదు..దేవుళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. అహంకారాన్ని వీడకపోతే ఆ దేవుడే మీ మదాన్ని అణగదొక్కుతారు. కనీసం ఒక్కనాడైనా ఇలాంటి ఘటనలపై జగన్ రెడ్డి స్పందించారా? అంతర్వేది రథం దగ్ధంపై వేసిన సీబీఐ విచారణలో పురోగతి లేదు. ప్రజల మనోభావాలను కాపాడలేని వాళ్లు పదవుల్లో కొనసాగే అర్హత లేదు.

దేవాదాయ శాఖా మంత్రి ఉన్నాడో లేడో కూడా అర్థం కావడం లేదు. మాన్యాలపై ఉన్న శ్రద్ధ దేవుడిపై ఎందుకు లేదు? దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై తక్షణమే ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించి నిందుతులను కఠినంగా శిక్షించాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.