శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మే 2022 (13:49 IST)

ఏపీలో రేపటి నుంచి జూనియర్ కాలేజీలకు సెలవులు

students
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు విద్యాశాఖ బుధవారం నుంచి సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు జూన్ 19వ తేదీ వరకు కొనసాగుతాయి. జూన్ 20వ తేదీన కాలేజీలు మళ్లీ పునఃప్రారంభమవుతాయని ఇంటర్ విద్యా మండలి మంగళవారం ప్రకటించింది. 
 
ఇదిలావుంటే, ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు సంబంధించి ఇంటర్ మార్కుల వెయిటేజిని తొలగించారు. ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయించనున్నారు. కరోనా కరోనా కారణంగా గత యేడాది ఇంటర్ ఫస్టియర్‌కు పరీక్షలు నిర్వహించలేదు. 
 
దీంతో ఈ వెయిటేజీ మార్కులను తొలగించారు. ఈఏపీసెట్‌ను 160 మార్కులకు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌ను తగ్గించినందున ప్రవేశ పరీక్షలోనూ ఆ పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉండవని తెలిపింది.