శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 20 జనవరి 2022 (11:53 IST)

పంజా సెంట‌ర్లో స‌య్య‌ద్ అస్లాం అనుమానాస్ప‌ద మృతి, విచార‌ణ‌కు డిమాండు

విజయవాడ పంజా సెంటర్ కు చెందిన సయ్యద్ అస్లాం అనే వ్యక్తి  అనుమానాస్పద మృతి చెందాడు.  తెల్లవారుజామున మృతి చెందిన అస్లాంను అదే రోజు సాయంత్రానికల్లా అంత్యక్రియలు పూర్తి చేశారు. అస్లాం మృతిపై  రెండవ భార్య అనుమానం వ్యక్తం చేస్తోంది. మొదటి భార్య నసీమ ఇంటివద్ద ఉన్న సమయంలో అస్లాం మృతి చెందాడు. న‌సీమ‌పై అనుమానం ఉంద‌ని పోలీసులకు ఆయ‌న రెండో భార్య షైక్ అస్మా ఫిర్యాదు చేసింది.  
 
 
సయ్యద్ అస్లాం గారి మృతిపై అనేక అనుమానాలు ఉన్నందున తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి , విచారణ చేపట్టి, పోస్టుమార్టం నిర్వహించి నిజానిజాలను బహిర్గతం చేయాలని టూ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మోహన్ రెడ్డిని స్థానిక నాయ‌కులు కోరారు. జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్, మాజీ కార్పొరేటర్ గాదె ఆదిలక్ష్మి, సి.పి.ఐ. ఎంఎల్  యువ నాయ‌కుడు అబ్దుల్ రెహ్మాన్ పోలీసుల‌కు విన‌తిప‌త్రం అందించారు.