బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (16:56 IST)

శింగనమల వైకాపా ఎమ్మెల్యే పద్మావతి కనిపించట లేదు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా ప్రజా ప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని పలువురు ఎమ్మెల్యేలు నిజం చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కనిపించడం లేదంటూ నియోజకవర్గం వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ఇవి స్థానికంగా కలకలం రేపుతున్నాయి.
 
"ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి. శింగనమల ఎమ్మెల్యే గారు. ఎన్నికల సమయంలో ఓటు అడగటానికి వచ్చిన పద్మావతిగారు... ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓటు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేకుండా, ప్రజా సమస్యలను పక్కకి నెట్టి ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆచూకీ తెలుపగలరు. ఇట్లు గుంజేపల్లి గ్రామ ప్రజలు. శింగనమల నియోజకవర్గం" అంటూ పోస్టర్లలో ముద్రించారు. ప్రస్తుతం ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.