సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2019 (11:10 IST)

సాధినేని యామినికి భరోసా ఇచ్చిన చంద్రబాబు.. అయినా నోరెత్తలేదుగా?

టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు, పార్టీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీ ఆమెకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. 
 
సాధినేని యామిని శర్మ కూడా త్వరలోనే కమలం గూటికి చేరొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... ఆమెను పిలిపించి మాట్లాడారని.. ఆమెకు పార్టీ అండగా వుంటుందని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తరపున తన వాయిస్‌ను బలంగా వినిపించిన సాధినేని యామిని... ఇప్పుడు మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. 
 
పార్టీ మార్పుపై చంద్రబాబుతో మాట్లాడారా అని అడిగితే... సాధినేని యామినీ... సమాధానం ఇవ్వట్లేదు. దాన్ని బట్టీ... ఆమె పార్టీ మారే అవకాశాలే ఎక్కువగా ఉండేలా ఉన్నాయి. మరి ఈ వార్తలపై సాధినేని యామినీ ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాలి.