శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

నారా లోకేశ్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు

nara lokesh
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి రావాలన్న పట్టుదలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. 
 
అయితే, ఆయన వయసు రీత్యా పాదయాత్ర చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. అదేసమయంలో ఆయన వారసుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ ఈ పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. 
 
ఇందులోభాగంగా, వచ్చే యేడాది జనవరి 27వ తేదీన ఈ పాదయాత్రను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇది చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభంకానుంది. లోకేశ్ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు సాగనుంది. యేడాది పాటు ప్రజల మధ్యే ఉండేలా లోకేష్ పాదయాత్రకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.