ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (14:34 IST)

డ్రోన్‌ ఘటన అనుమానాలకు తావిస్తోంది : తెదేపా నేతల ఫిర్యాదు

తెదేపా అధినేత చంద్రబాబు నివాసంపై డ్రోన్‌ ఎగురవేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఆ పార్టీ నేతలు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను రాజ్‌భవన్‌లో కలిసి ఫిర్యాదు చేశారు. నాలుగు పేజీల లేఖను గవర్నర్‌కు అందజేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో చంద్రబాబు భద్రతను కుదించిన ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాల తర్వాత తిరిగి భద్రతను పెంచడాన్ని తెదేపా నేతలు ఈ సందర్భంగా గవర్నర్‌కు గుర్తు చేశారు. 
 
వైకాపా ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పూనుకొంటోందని, డ్రోన్‌ ఎగరవేస్తూ పట్టుబడిన వ్యక్తి జగన్‌ నివాసంలో ఉండే కిరణ్‌ ఆదేశాలమేరకే చిత్రీకరించానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని తెదేపా నేతలు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. 
 
గవర్నర్‌ను కలిసిన వారిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, గల్లా జయదేవ్‌, టీడీఎల్పీ ఉపనేతలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామారావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుతో సహా 15 మంది సభ్యుల బృందం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. డ్రోన్‌ అంశంపై ఇప్పటికే గుంటూరు ఐజీకి తెదేపా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.