చంద్రబాబు హత్యకు కుట్ర.. ఆత్మహత్య చేసుకుంటానంటున్న టీడీపీ నేత

buddha venkanna
Last Updated: ఆదివారం, 18 ఆగస్టు 2019 (15:36 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హత్యకు కుట్ర జరుగుతోందని, అందుకే ఆయన ఇంటిపై డ్రోన్‌తో రెక్కీ నిర్వహించారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నా ఆరోపించారు. ఇటీవల కిరణ్ అనే వ్యక్తి చంద్రబాబు ఇంటికి సమీపంలో డ్రోన్లతో టీడీపీ కార్యకర్తలకు చిక్కిన విషయం తెల్సిందే. ఈ వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది.

ఈ అంశంపై బుద్ధా వెంకన్నా స్పందిస్తూ, చంద్రబాబు హత్యకు కుట్ర జరుగుతుందన్నారు. అందుకే చంద్రబాబు ఇంటిని డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీశారని విమర్శించారు. చంద్రబాబు ఇంటి దగ్గర స్వయంగా వైసీపీ మంత్రులు రెక్కీ నిర్వహించారని ఆయన ఆరోపించారు.

చంద్రబాబుపై పన్నుతున్న కుట్రలను ఇప్పటికైనా వైసీపీ ఆపాలని సూచించారు. లేదంటే ముఖ్యమంత్రి జగన్ ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. చంద్రబాబుకు భద్రతను కట్టుదిట్టం చేయడంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని బుద్ధా వెంకన్న ప్రకటించారు. చంద్రబాబుకు కేంద్రమే రక్షణ కల్పించాలని బుద్ధా వెంకన్నా డిమాండ్ చేశారు.దీనిపై మరింత చదవండి :