Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

జూపూడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ ఎమ్మెల్యే

Written By ఎం
Updated: బుధవారం, 9 అక్టోబరు 2019 (00:46 IST)
జూపూడి ప్రభాకర్‌రావుపై కొండేపి ఎమ్మెల్యే బాలవీరాంజవేయస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జూపూడికి అధికారమే పరమావధిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారంలో ఉన్న పార్టీలోనే జూపూడి ఉంటారని ఎద్దేవా చేశారు. గడ్డి ఉన్న చోటకు గొర్రె పరుగులు పెట్టినట్లు జూపూడి వైఖరి ఉందన్నారు. గతంలో దళిత పులిని అంటూ ప్రకటన చేసుకుని నేడు ఆ దళితులను వంచిస్తూ.. వైసీపీలో చేరారన్నారు. 'జగన్‌ కాలకేయుడు, ప్రమాదకరమైన విషం' అంటూ గతంలో జూపూడి విమర్శించారని గుర్తుచేశారు.

జగన్‌ ఓ సైకో.. అందుకే వైఎస్ దూరంగా ఉంచారని నాడు జూపూడి వ్యాఖ్యానించిలేదా?, నేడు అలాంటి జగన్ చెంతకు జూపూడి చేరడం అవకాశవాదానికి నిదర్శనమని చెప్పారు. జైలుకు వెళ్లొచ్చిన వారంతా ఉద్యమకారులు కాదనే విషయం జూపూడి గుర్తించాలని హితవు పలికారు.

జగన్‌ ఏ కారణంగా జైలుకు వెళ్లారో ప్రజలందరికీ తెలుసన్నారు. జూపూడి పొగడ్తలు, ప్రశంసలు అన్నీ కూడా పదవుల కోసమేనన్నారు. రంగులు మార్చడంలో జూపూడి ఊసరవిల్లితో పోటీపడుతున్నారని సైటర్ వేశారు. మంగళవారం సీఎం జగన్ సమక్షంలో జూపూడి ప్రభాకర్‌రావు వైసీపీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జూపూడిని జగన్ ఆలింగనం చేసుకున్నారు.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments