మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2019 (15:03 IST)

ఆ గ్రామంలో 'జై లంకేష్' అనాల్సిందే

దేశవ్యాప్తంగా ఈరోజు దసరా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు నిర్వహంచే రావణ దహన వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


అయితే దీనికి విరుద్ధంగా మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లాలో గల నటెరన్ పరిధిలోని ‘రావణ్’ గ్రామంలో ప్రస్తుతం పెద్దఎత్తున లంకేశ్వరునికి పూజలు జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతుండటం విశేషం. గ్రామంలో ఎవరింట ఎటువంటి శుభకార్యం జరిగినా మందుగా ఈ రావణ ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు.

‘రావణ్ బబ్బా’ పేరుతో ఈ ఆలయం ఖ్యాతి పొందింది. గ్రామంలోని ఎవరైనా నూతన వాహనాన్ని కొనుగోలు చేసినపుడు దానిపై ‘జై లంకేష్’ అని రాయిస్తుంటారు.