శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 30 జూన్ 2017 (17:53 IST)

ప్లీనరీనా.. జబర్దస్త్ షో పెడుతున్నారా? ఐరన్ లెగ్ రోజా అక్కడే వుండాలి: వర్మ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాపై పీఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. ఐరన్ లెగ్ రోజా ఎల్లప్పుడూ వైకాపాలోనే ఉండాలని.. దాంతో జగన్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటారని సెటైర్ వేశార

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాపై పీఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. ఐరన్ లెగ్ రోజా ఎల్లప్పుడూ వైకాపాలోనే ఉండాలని.. దాంతో జగన్ ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటారని సెటైర్ వేశారు. కాకినాడలో వైసీపీ జిల్లా ప్లీనరీకి ఏర్పాట్లు చేస్తున్నారని.. జనాలకు మాత్రం అక్కడ ప్లీనరీ పెడుతున్నారో లేక రోజా జబర్దస్త్ షో పెడుతున్నారో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. 
 
ఎంతో రాజకీయ అనుభవం నేతలపై రోజా తీవ్ర విమర్శలు చేయడంపై వర్మ ఫైర్ అయ్యారు. కేవలం జగన్ ఇస్తున్న ప్యాకేజీల కోసమే రోజా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతి రోజు పోలవరం ప్రాజెక్టు గురించి వైకాపా విమర్శించడం అలవాటుగా మారిపోయిందన్నారు. 
 
అసలు రోజా కానీ, జగన్ కానీ ఏనాడైనా పోలవరం ప్రాజెక్టును చూశారా? అని వర్మ ప్రశ్నించారు. ఐరన్ లెగ్ రోజా ఎల్లప్పుడూ వైసీపీలోనే ఉండాలని, అలా వుంటేనే వైకాపా చీఫ్ జగన్ ఎప్పటికీ విపక్షంలో ఉంటారని సెటైర్ విసిరారు.