సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (16:03 IST)

గుండెలు బాదుకున్నా ఏపీకి ప్రత్యేక హోదా రాదు : జేసీ దివాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానేరాదనీ, కానీ, ప్రత్యేక ప్యాకేజీ మాత్రం వస్తుందని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రానేరాదనీ, కానీ, ప్రత్యేక ప్యాకేజీ మాత్రం వస్తుందని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశానుసారం తాము నడుచుకుంటామన్నారు. అవసరమైతే తమ ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
ఇకపోతే, తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తామంటూ వైసీపీ డ్రామాలు ఆడుతోందని, ఒకవేళ వారు రాజీనామాలు చేసినా, అవి ఆమోదం పొందే లోపే ఎన్నికల కోడ్ వస్తుందని గుర్తు చేశారు. అందుకే బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత రాజీనామాలు చేస్తామంటూ సరికొత్త నాటకానికి జగన్ పార్టీ నేతలు తెరదీరాశారని ఆరోపించారు.