శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (14:29 IST)

పోలవరం పనుల్లో చంద్రబాబుకు ముడుపులు అందాయ్ : జైరాం రమేష్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం పనుల్లో చంద్రబాబు నాయుడుకి ముడుపులు అందాయని ఆరోపించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. పోలవరం పనుల్లో చంద్రబాబు నాయుడుకి ముడుపులు అందాయని ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో ఆయన ముడుపులు తీసుకున్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయడంలో బీజేపీ, టీడీపీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
 
విభజన హామీలకు సంబంధించి ప్రధాని మోడీ, చంద్రబాబు ఇద్దరూ డ్రామాలాడుతున్నారని అన్నారు. నాలుగేళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కేవలం పునాది రాళ్లకే పరిమితమయిందని వ్యాఖ్యానించారు. ఏపీ విభజన శాస్త్రీయంగా జరగలేదని బీజేపీ అంటోందని... అదే నిజమైతే పార్లమెంటులో మెజార్టీ కలిగిన బీజేపీ చట్టంలో మార్పు చేయవచ్చు కదా?, అలా చేస్తే తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని జైరాం రమేష్ వెల్లడించారు.