శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 15 నవంబరు 2021 (14:18 IST)

కుప్పంలో దొంగ ఓటర్లను మావాళ్ళు రాత్రే పట్టుకున్నారు...

చరిత్రలో ఎన్నికలను ఇంత అపహాస్యం చేసిందెన్నడూ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తప్పుడు పనులు చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పోలింగ్‌లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. 
 
 
ఈ నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ''వైకాపా నేతలు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితికి వస్తారు. దొంగ ఓట్లు వేయబోతున్నారని ముందే చెప్పాం. మున్సిపల్‌ ఎన్నికలను కూడా అహహాస్యం చేసిన ఘటనలా? ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి ఇన్ని కుట్రలా? గెలిచామని చెప్పుకోవడానికి అక్రమాలకు పాల్పడుతున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.
 
 
పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. దొంగలకు వంతపాడేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కుప్పంలో దొంగ ఓటర్లను రాత్రే తెదేపా నేతలు పట్టుకున్నారు. ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఫిర్యాదును పట్టించుకోకుండా తెదేపా నేతలను అరెస్టు చేశారు. దొంగ ఓటర్లను వారి కుటుంబ సభ్యులే అసహ్యించుకుంటున్నారు. పోలింగ్‌ ఏజెంట్లను అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారు'' అని చంద్రబాబు అన్నారు.