బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (14:57 IST)

రాహుల్ ప్రధాని అయితే, తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదాపైనే : కుంతియా

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి అయితే ఆయన చేసే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ చేసే ఫైల్‌పైనే ఉంటుంది తెలంగాణ రాష

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి అయితే ఆయన చేసే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తూ చేసే ఫైల్‌పైనే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస ఇన్‌ఛార్జ్ ఆర్.సి. కుంతియా వ్యాఖ్యానించారు.
 
ఆయన గురువారం తిరుమల శ్రీవారిని టీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో కలిసి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ ప్రధానమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తారని చెప్పారు. 
 
రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కోసం చేసిన చట్టాలను ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే ప్రత్యేక హోదా కోసం అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నా కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల బాగుండాలనే విభజన ప్రక్రియను కాంగ్రెస్ పూర్తి చేసిందన్నారు.