గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (12:20 IST)

మచిలీపట్నంలో ఉద్రిక్తత.. కొల్లు రవీంద్ర అరెస్ట్

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల నిరవధిక నిరసన దీక్ష నేపథ్యంలో మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. ఇసుక కొరతపై దీక్షకు సిద్ధమైన కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.దీక్షలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో 144 సెక్షన్ విధించారు. 

ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని హౌస్ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. శాంతియుతంగా ఆందోళన చేసే వారిని అరెస్టు చేయడం అన్యాయమని టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు.