శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (11:47 IST)

రాష్ట్రంలో నేడూ, రేపు వర్షాలు

నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. జోరు వానలు ప్రజలను తేరుకోనివ్వటం లేదు. ఉరుములు, మెరుపులు భయకంపితులను చేస్తున్నాయి. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.

బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే గరిష్ఠంగా యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలో 13.3 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. ఖమ్మం జిల్లా ఏన్కూరులో 9.3సెం.మీ. ములుగు జిల్లా గోవిందరావు పేటలో 7.5 సెం.మీ. వర్షం నమోదయింది.

గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్​లో 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.