సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 సెప్టెంబరు 2024 (21:59 IST)

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

murder
అన్యమతస్థుడిని ప్రేమించిన పాపానికి ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులే పరువు పేరిట ఆ యువతిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రం పల్లెపాలెంకు చెందిన శ్రావణి అనే యువతి వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించింది. 
 
ఈ వ్యవహారం నచ్చని ఆమె కుటుంబీకులు ఆమెను మట్టుబెట్టారు. శ్రావణిని గత నెల 24న హత్యచేసి, మృతదేహాన్ని ఇంటి పక్కనే పూడ్చిపెట్టారు. ఆపై శ్రావణి కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
దీనికి తోడు గ్రామస్తులు సైతం శ్రావణి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపై జరిపిన విచారణలో నేరాన్ని అంగీకరించారు. మృతురాలి తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.