1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 జులై 2025 (12:23 IST)

Tirumala: తిరుమల డెయిరీ మేనేజర్ ఆత్మహత్య- ఉరేసుకునే ముందు చెల్లికి ఈ-మెయిల్ (video)

Naveen
Naveen
తిరుమల డెయిరీ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీ-విశాఖకు చెందిన నవీన్ బొలినేని (37) చెన్నై- మాధవరంలోని తిరుమల డెయిరీలో ట్రెజరీ మేనేజరుగా పని చేస్తున్నాడు. రూ.40 కోట్లు మనీ ల్యాండరింగ్ కేసు నేపథ్యంలో తిరుమల డెయిరీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
తిరుమల మిల్క్ డెయిరీలో రూ.40 కోట్ల మేర మనీ ల్యాండరింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలపై తల్లికి, స్నేహితులకు, బంధువులకు నవీన్ ఈ-మెయిల్ పంపినట్లు సమాచారం అందుతోంది. 
 
నవీన్ ఏకంగా రూ.40 కోట్ల మేర మనీ లాండరింగ్ పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో తప్పును ఒప్పుకున్న నవీన్ నగదును తిరిగి ఇస్తానని చెప్పి పుళల్ బ్రిటానియానగర్‌లో తనకు చెందిన షెడ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
ఆత్మహత్యకు ముందు తన చెల్లికి ఈ-మెయిల్ పంపాడు. వారు సంఘటనా స్థలానికి చేరుకునే ముందే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.