1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 జులై 2025 (10:03 IST)

Lady Aghori: ప్రొఫెసర్‌కు బెదిరింపులు- బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్న అఘోరీ

Lady Aghori
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లేడీ అఘోరీ, శ్రీవర్షిణి వ్యవహారం సంచలనం రేపింది. వీరి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అనంతరం అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో శ్రీవర్షిణీకి దాదాపు 45 రోజుల పాటు కౌన్సిలింగ్ ఇచ్చి ఇటీవలే రిలీజ్ చేశారు. 
 
ఈ నేపథ్యంలో లేడీ అఘోరీ అలియాస్ శ్రీనివాస్‌ను కరీంనగర్ కోర్టుకు తరలించారు. కొత్తపల్లి పీఎస్‌లో మే5న అఘోరీపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అలాగే ప్రొడ్యూసర్‌ను బెదిరించి డబ్బులు తీసుకున్న విషయంలో కూడా అఘోరీపై కేసు ఫైల్ చేశారు. 
 
ఈ కేసులో అఘోరీకి మే5న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం యువతిని మోసం చేసిన కేసులో 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌లో ఉంది. ఈ కేసులో కూడా అఘోరీ బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నాడు.