తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ షాకింగ్ న్యూస్.. ఏంటది?
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ షాకింగ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 5వ తేదీన తిరుమలలో విఐపి దర్శనాలను నిలిపివేసినట్టు టిడిపి ఒక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 7 నుండి 15 వరకు తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5న ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కారణంతోనే అక్టోబర్ 4న విఐపి దర్శనం నిలిపివేస్తున్నారు.
అంతేకాకుండా విఐపి దర్శనం కోసం ఎలాంటి లేఖలు స్వీకరించమని టీటీడీ స్పష్టం చేసింది. కాబట్టి భక్తులు సహకరించాలని కోరింది. ఇదిలా ఉండగా నిన్న శ్రీవారిని 27,167 మంది భక్తులు దర్శించుకున్నారు. 13,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.95 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది.