శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (10:46 IST)

భారీ వర్షాలు.. గోదావరికి నీటి మట్టం పెరిగింది.. ప్రమాదకర రీతిలో..?

రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోనే కాకుండా ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో గోదావరి నదికి నీటి మట్టం పెరుగుతోంది. గోదావరితో పాటు దాని ఉపనదుల ప్రాణహిత, ఇంద్రావతి నదులకు మహారాష్ట్ర, చత్తీస్గడ్ వర్షాల కారణంగా వరద పెరిగింది. ఫలితంగా గోదావరి నది ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది. 
 
దీంతో పాటు తెలంగాణలో కడెం, ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత త్రివేణి సంగమం వద్ద వరదనీరు ప్రమాదకరంగా మారడంతో అధికారులు మొదటిప్రమాద హెచ్చిరక జారీ చేశారు.
 
కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని అన్నారం సరస్వతి బ్యారేజ్ 62 గేట్లను, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 79 గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో 1.09 లక్షల క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లోగా దిగువకు వెళుతోంది. రాష్ట్రంలోని మరోనది మంజీరాకు కూడా వరద ఉద్రుతి పెరిగింది. ఏపీలో ధవళేశ్వరం వద్ద 7.30 అడుగుల నీటిమట్టం వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. 4.86 లక్షల క్యూసెక్కుల నీటరు సముద్రం వైపు వెళుతోంది.